నూతన తహసిల్దార్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

నూతన తహసిల్దార్ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్, అక్టోబర్ 01, మహానంది: మహానంది మండలంలో నూతనంగా నిర్మించిన తహసిల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన తహశీల్దార్‌ కార్యాలయంలో ప్రజలకు సేవలు అందించేందుకు దోహదపడతాయన్నారు.
అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని అన్నారు.నవరత్నాల్లో ఇచ్చిన హామీల్లో కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల సంక్షేమం విద్యా, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.


ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర్ రెడ్డి,ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,ఎస్సై నాగార్జున రెడ్డి, తాసిల్దార్ జనార్దన్ శెట్టి, డిప్యూటీ తాసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో శివ నాగజ్యోతి,సర్పంచ్ శిరీష, జడ్పీటీసి కేవీఆర్ మహేష్ రెడ్డి,ఎంపీటీసీ వెంకటేశ్వర్లు,వ్యవసాయ మండలి సలహా చైర్మన్ శరభ రెడ్డి,వైసిపి మండల ,గ్రామ నాయకులు కొండా మధు సుధన్ రెడ్డి, వీరా రెడ్డి, బండి రమణయ్య, పుల్లయ్య యాదవ్, కందుల రఘురామ్ రెడ్డి,వడ్డే శ్రీనివాసులు, గోపవరం కృష్ణ రెడ్డి, అశోక్ రెడ్డి,మద్దుల బాల వెంకట్ రెడ్డి,వీఆర్వో వెంకట రాముడు, వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!