స్టూడియో 10 టివి న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా: మెదక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో జరిగిన యాన్వల్ డే ప్రోగ్రాంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలకు విద్యార్థులు ప్రతి ఒక్కరూ దూరంగా ఉండాలని యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు ముందుకు సాగాలన్నారు.యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడడం వలన క్రమేపి ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారుతుందని నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం గమనించాలని పేర్కొన్నారు.తద్వారా కుటుంబ సభ్యుల సత్సంబంధాలుకు దూరమవుతారని అన్నారు. చెడు అలవాట్లకు బానిసై యువత చెడిపోవద్దని ఆయన సూచించారు.అదేవిధంగా పోలీస్ కళాబృందం ద్వారా మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగి నష్టాలను ప్రజలకు తెలియజేసి వారిలో అవగాహన తీసుకురావాలని మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా దాని నుండి ఆదిలోనే తుంచి వేయాలని కోరారు.ఎవరైనా నిషేధిత మాదక ద్రవ్యాల యొక్క సమాచారాని తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచి అట్టి వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.డ్రగ్స్ సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ 1908 కి లేదా డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు విక్రయించిన తీసుకున్న వారికి కఠిన శిక్షలు తప్పవు అని ఎస్పీ తెలిపారు. అదేవిదంగా మెదక్ జిల్లాలో గత సంవత్సరం ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో పోయిన డబ్బు కంటే కూడా సైబర్ నేరల వల్లన పోయిన డబ్బే ఎక్కువ అని అన్నారు. ఇందులో ఎక్కువ చదువుకున్న వ్యక్తులు కూడా ఉన్నారని కాబ్బటి సైబర్ నేరల పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగివుండి అప్రమతంగా ఉండాలన్నారు. విద్యార్థుల వారి కుటుంబ సభ్యులకు మరియు వారి బంధువులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.ఆన్లైన్ మోసాలకు గురి అయినట్లైతే మొదటి 1 గంట (Golden Hour)లో 1930కు కాల్ చేసి లేదా యన్.సి.ఆర్.పి. https://www.cybercrime.gov.in/ పోర్టల్ నందు ఫిర్యాదు నమోదు చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!