సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
సంపూర్ణ వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం – శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి
పోలాకి మండలం/ జనవరి 06:- సంపూర్ణ వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి అన్నారు. సోమవారం నాడు
1.పోలాకి మండలం,దీర్ఘాశి గ్రామానికి చెందిన పల్లి రమణయ్య ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన కుటుంబానికి 1లక్ష రూపాయలు చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
- పోలాకి మండలం వెదుళ్ళవలస గ్రామానికి చెందిన పల్లి కృష్ణమ్మ గారికి కుడి కాలు సర్జరీ కోసం 33,752 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బాధితుడు కి చెక్కను అందించిన ఎమ్మెల్యే శ్రీ బగ్గు రమణమూర్తి గారు….
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ పేదలందరికీ అత్యుత్తమ వైద్యం అందజేసేందుకు సీఎంఆర్ఎఫ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కులను అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారురాలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.