తెలంగాణలోని అన్ని ఆలయాల్లో ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యి మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేట్ డైయిరీతో ఒప్పందం చేసుకున్న భద్రాద్రి ఆలయ అధికారులపై చర్యలు తీసుకుంది. అన్ని ఆలయాల్లో నెయ్యి సరఫరాపై నివేదిక ఇవ్వాలని, ఇతర డెయిరీలతో ఒప్పందాలు చేసుకుని ఉంటే రద్దు చేసుకోవాలని సూచించింది. అయితే యాదాద్రి లక్ష్మీనరసింహ ఆలయంలో మాత్రం మార్చి వరకు మదర్ డెయిరీ నెయ్యి వాడేందుకు అనుమతి ఇచ్చింది.