వందేళ్ళ మహాదేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు.. మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
- ఎస్.డి.ఎఫ్.నిధుల నుండి ఏడుపాయల,చర్చి కు త్వరలో నిధుల మంజూరు
- ఏడుపాయల, చర్చి పోచారం అభయారణ్యాలను టూరిజంగా ఏర్పాటు చేస్తా.
మెదక్ నియోజక వర్గంలోని ఏడుపాయల దేవస్థానం చర్చి పోచారం అభయారణ్యాలను టూరిజం స్పాట్ గా ఏర్పాటు చేస్తానని ఈ నెల 25న జరిగే క్రిస్మస్ వేడుకలతో పాటు చర్చి దేవాలయం కు వందేళ్ళు అవుతున్న సందర్భంగా మహాదేవాలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా.మైనంపల్లి రోహిత్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కోన్నారు. అంతే కాకుండా స్పెషల్ డెవలప్ మెంట్ నిధుల నుండి ఏడుపాయల మరియు చర్చి కు నిధులు రానున్నట్లు ఆయన తెలిపారు.