గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలోట్రాఫిక్ సమస్యలు మహిళల పై చిత్తశుద్ధి కూడా చూపించలేరు.. మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్

స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా

  • మాజీ ఎమ్మెల్యే మహిళగా ఉన్న మహిళలకు భద్రతకల్పించడంలో విఫలం
  • సంవత్సర కాంగ్రెస్ పాలనలో మెదక్ పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు
  • నియోజక వర్గంలో త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లు
  • మహిళలను అల్లరిమూకల నుండి రక్షించేందుకు పటిష్టమైన భద్రత కల్పిస్తాం
  • త్వరలోనే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కా భవనం ఏర్పాటు
  • ట్రాఫిక్ యంత్రాంగం పై జిల్లా ఎస్పికి ఆదేశాలు జారీ
  • మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్
    గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో మెదక్ నియోజక వర్గాన్నికి ఒరగబెట్టింది ఏమని లేదని కనీసం మహిళా ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మహిళలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలం అయ్యారని మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మండిపడ్డారు.మంగళవారం మెదక్ నియోజక వర్గంలో పలు కార్యక్రమాలకు విచ్చేసిన నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం మెదక్ కు శనిగా దాపురించిందని ఆయన ఎద్దేవ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎమ్మెల్యేగా సంవత్సర కాలంలోనే ట్రాపిక్ సమస్యలు అలాగే మహిళల యొక్క భద్రతా విషయంలో గత నెల అక్టోబర్ 28న స్వయాన రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాని అందించిన విషయం తెలిసిందే. కాగా పట్టణంలో ట్రాఫిక్ సమస్యతో రోడ్డు ప్రమాదాలు తరుచుగా జరుగుతున్న దృష్ట్యా తక్షణమే ట్రాపిక్ పోలీస్ స్టేషన్ ను మంజూరు చేయించి ట్రాపిక్ ను కంట్రోల్ చేయించేందుకు ట్రాపిక్ పోలీసులను నియమించినట్లు ఆయన పేర్కోన్నారు. ట్రాఫిక్ సమస్యలు మరియు ట్రాపిక్ పోలీస్ యంత్రాంగం పై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని అలాగే జిల్లా ఎస్పికి పలు సూచలను జారీ చేసినట్లు పేర్కోన్నారు. అదే విధంగా మహిళలను అల్లరిమూకల నుండి రక్షించేందుకు పటిష్టమైన భద్రతను కల్పిస్తామని ఆయన పేర్కోన్నారు.ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లో ట్రాపిక్ వింగ్ ను ఏర్పాటు చేసి ట్రాపిక్ సమస్యలను తగ్గించే దిశగా ట్రాపిక్ పోలీస్ స్టేషన్ ప్రారంభం అయినట్లు అదే విధంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాపిక్ పోలీస్ ల పాత్ర కీలకం అని నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. త్వరలోనే పట్టణంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు పక్కా భవనాన్ని సమకూర్చుతానని ఆయన స్పష్టం చేసారు.మెదక్ పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ తో పాటు నియోజక వర్గంలోని పలు మండలాల్లో నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చినట్లు దానిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ అన్నారు. అతి త్వరలోనే నూతన పోలీస్ స్టేషన్ బిల్డింగ్ లను కూడా ఏర్పాటు చేసుకోబుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!