మెదక్ జిల్లా కేంద్రంలో వైద్య కళాశాలను పరిశీలించిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్టూడియో 10 టివి ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా
మంగళవారం మెదక్ జిల్లా కేంద్రం.పిల్లకొట్యల్ లో వైద్య మెడికల్ కాలేజ్ క్యాంటీన్ మరియు హాస్టల్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు సోమవారం నుండి ప్రారంభం కానున్నట్టు తెలిపారు. వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రత్యేక చొరవతో విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ క్యాంటీన్ మెస్ వసతులు కల్పించడం జరిగిందన్నారు. నిరుపేదలకు వైద్యం అందించే దిశగా ఒక మెదక్ ప్రాంతంలో మెడికల్ కాలేజీని ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా వైద్య సేవలకు ఈ ప్రాంతవాసులు వినియోగించుకునేలాగా అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ రవీందర్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.