పురస్కరించుకొని నిర్వహించిన అవగాహన ర్యాలీ * అనకాపల్లి జిల్లా యస్. రాయవరం మండలం సర్వసిద్ది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద సర్వసిద్ది పి.హెచ్. సి వద్ద ఆశా డే సందర్భంగా హాజరైన ఆశా కార్యకర్తలు కు “మానసిక ఆరోగ్య అవగాహన మాసోత్సవాలు” ను పురస్కరించుకొని మానసిక ఆరోగ్యం పై ఆశా కార్యకర్తలు కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం ఎస్ వి కె.బాలాజీ ఆదేశాలు మేరకు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ ఎస్ వి శక్తి ప్రియ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శారీరకంగా దృఢంగా, ఆరోగ్యంగా వున్న సరే మానసికంగా కూడా ఆరోగ్యం గా వుండాలని అప్పుడు మాత్రమే పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా వుంటారని ఆశా కార్యకర్తలకు ఆశా డే సందర్భంగా నిర్వహించిన మంత్లీ రివ్యూ మీటింగ్ ను ఉద్దేశించి మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించారు. తదుపరి ఆరోగ్య విస్తరణ అధికారి టి నాగేశ్వరరావు పర్యవేక్షణలో , ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ క్లినిక్ క్లస్టర్ పర్యవేక్షకులు *డాక్టర్ పి.ఎన్.వి.ఎస్.ప్రసాద్ ఆధ్వర్యంలో 1. మానసిక వైకల్యం వుంటే…సమాజం వెనక్కి పోతుందంటే. 2.మానసిక ఒత్తిడి తగ్గించుకో …మానసిక ఆరోగ్యం పెంపొందించుకో అనే నినాదాలు తో అవగాహన ర్యాలీ ఆశా కార్యకర్తలు తో కలిసి నిర్వహించారు.వీరితో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్ వైజర్ లు, హెల్త్ సెక్రటరీ లు హాజరయ్యారు.