సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది -02-10-2024.
మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి గారు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి మున్సిపల్ కౌన్సిలర్లు పార్టీ నాయకులతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని మహాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధముగా అహింస మార్గంలో పోరాడి భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రం తీసుకొచ్చారని తెలిపారు.విద్య, ఆర్థిక, కుల సమానత్వంతోనే గ్రామస్వరాజ్యం సాధ్యమని అన్నారు. గాంధీజీ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహావ్యక్తి అన్నారు. గాంధీజీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. గాంధీజీ కలలు కన్న నవసమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని కోరారు. హింసావాధాన్ని విడనాడి అహింసావాదంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.