సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది -20-09-2024.
తెలంగాణ ప్రభుత్వ ఆదేశానుసారం పెండింగ్ ధరణి అర్జీలను స్పెషల్ డ్రైవ్ పద్ధతిలో పరిష్కరించడానికి జిల్లాలోని సమస్త రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమై యున్నదని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జూలై 1వ తేది నాటికి జిల్లాలో సుమారుగా 10,400 దరాఖాస్తులు పెండింగ్ లో ఉంటే జులై ఆగస్టు సెప్టెంబర్ లో వచ్చిన దరఖాస్తులను కూడా కలుపుకుంటే మొత్తంగా సుమారుగా 14,000 దరఖాస్తులు వచ్చాయన్నారు.
గడిచిన రెండున్నర నెలల్లో జులై ఆగస్టుసెప్టెంబర్ 20వ తేదీ వరకు సుమారుగా 10,000 దరఖాస్తులు పరిష్కరించబడినవన్నారు .
ఇంకా మిగిలిన దరఖాస్తులను కూడా అతి త్వరలో పరిష్కరించడానికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తున్నదని వచ్చే వారం నుండి ప్రతి సోమవారంనాడు అన్ని తహశీల్దారు కార్యాలయాలలో రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో కూడా ప్రజావాణి పెద్ద ఎత్తున నిర్వహించబడుతుంది కావున ప్రజలందరూ భూమి ధరణి సమస్యలు ఉంటె సంబందిత తహశీల్దారు లేదా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయాలలో సోమవారం రోజున ప్రజావాణిలో సంబందిత కార్యాలయాలలో సంప్రదించగలని,దరఖాస్తుపై (7) పని దినములలో వ్రాత పూర్వకముగామీకు
సమాధానం ఇవ్వబడుతుందని తెలిపారు.ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.