తెలంగాణ రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు కృతజ్ఞతగా మీరే రాజీవ్ విగ్రహం పెట్టాల్సింది పోయి కూల్చేస్తామంటారా? ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని సన్నాసి నువ్వు. సచివాలయం సాక్షిగా చెబుతున్న బిడ్డా.. మీ ఫామ్ హౌస్లో జిల్లేళ్లు మొలిపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు..