కొత్త మెడికల్ కాలేజీలను తేకుండా రద్దు చేయాలని ప్రభుత్వమే లేఖలు రాయడమేమిటి? కామనురు శ్రీనివాసులు రెడ్డి ఈరోజు కడప నగరంలో సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామనురు శ్రీనివాసులరెడ్డి ,బి. దస్తగిరి రెడ్డి విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీలపై ‘చంద్రబాబు కత్తి! సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న టీడీపీ హామీ ఏమైంది? రాష్ట్ర ప్రభుత్వ , ఎన్డీఏ కూటమి నిర్వాకంతో ఈ ఏడాది 50 ఎంబీబీఎస్ సీట్లు పోయాయ్ చంద్రబాబు ‘పీ 4’ జపంతో గుజరాత్ మోడల్ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజ్ అప్పజెప్పడం కోసం ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనివల్ల పేదలకు మెరిట్ వచ్చిన విద్యార్థులకు ఏకంగా 1,750 సీట్లకు ఎసరు పులివెందుల కాలేజీకి ఎల్వోపీ ఇచ్చిన జాతీయ వైద్య కమిషన్ కాలేజీని నిర్వహించలేమని గుట్టు చప్పుడు కాకుండా లేఖ రాసిన సర్కారు ఎల్వోపీ ఇవ్వలేదని అధికారుల బుకాయింపు..రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి, వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా ? ఇప్పటికే అందని ద్రాక్షలా మారిన వైద్య విద్యను .. పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా ? గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారు ? ప్రైవేటీకరణ పై సమాధానం చెప్పాలి. కూటమి సర్కార్ లో భాగస్వామ్య పక్షంగా ఉండి, ఈ ఏడాది 5 కొత్త కాలేజీలైన పులివెందుల,ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరుల్లో వసతులను కల్పించలేమని,నిర్వహించడంసాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని. మెడికల్ బోర్డు కి లేఖ రాయడాన్ని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుంది. దీనివల్ల రాయలసీమ పరిధిలోని ఎస్ వి యూనివర్సిటీ విద్యార్థులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్ ఆలోచించాలి ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్ధనుకుంటుందా ? ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు. కొత్తగా 750 సీట్లు సమకూరక పోవడం మీ నిర్లక్ష్యం ఫలితమే. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్ ను అగమ్య గోచరంగా మార్చారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారు. మెడికల్ సీట్లకోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి వైసిపి సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే… ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి, మరింత నాబార్డ్ కింద నిధులు తీసుకొచ్చి వైద్య కళాశాలను పూర్తి చేసి ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని డిమాండ్ చేస్తుంది