సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
తేది 16-09-2024.
గణేష్ ఊరేగింపు సమయంలో గ్రామాల్లో విద్యుత్ తీగల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
గణేష్ నిమజ్జనం రూట్లో సి.సి కెమెరాల ఏర్పాటు పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం
గణేష్ వినాయక ప్రతిమను ఊరేగించే వాహన డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి
మద్యం తాగి వాహనం నడుపరాదు తాగి నడిపితే చర్యలు తప్పవు
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టామని గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలు గణేష్ ఉత్సవ కమిటీల వారు పోలీసు వారి సూచనలను పాటించాలని తెలిపినారు.గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరిగాయనీ అలాగే గణేష్ నిమజ్జన కార్యక్రమాలను కూడా ప్రజలు సంతోషకరమైనఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఇప్పటికే పోలీసు శాఖ ప్రతి వినాయక మండపం వద్ద సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
పోలీసులతో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తుందని గణేష్ నిమజ్జనం యాత్ర ప్రశాంతంగా శాంతియుతంగా జరిగేలా పగడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. నిమజ్జనం చేసే ప్రాంతాలలో ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించినారు.గణేష్ ఊరేగింపు సమయంలో గ్రామాల్లో విద్యుత్ తీగల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.నిమజ్జనం కోసం కండిషన్లో ఉన్న వాహనాలు మాత్రమే గణేష్ యాత్రకు వినియోగించాలని అన్నారు.గణేష్ వినాయక ప్రతిమను ఊరేగించే వాహన డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలని మద్యం తాగివాహనం నడుపరాదని తాగినడిపితే చర్యలు తప్పని హెచ్చరించారు.ఈత రాని వారు ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జన సమయంలో నీళ్లలో దిగకూడదని సూచించారు.ఇతర మతాలను గాని ఇతర వర్గాలకు చెందిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఎలాంటి రెచ్చగొట్టే పనులు వాఖ్యలు చేయవద్దన్నారు. చిన్నారులను వృద్ధులను నిమజ్జన ప్రాంతాలకు తీసుకురావద్దని తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్త చూసుకోవాలని కోరారు.జిల్లాలో ప్రశాంతంగా గణేష్ యాత్ర నిమజ్జన నిర్వహణ కోసం ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉత్సవ కమిటీ సభ్యులు శాంతి కమిటీ సభ్యులతో పోలీసు అధికారులు సమావేశం నిర్వహించారని ఎవరయినా శాంతిభద్రతల విఘాతం కలిగిస్తూ చట్ట వ్యతిరేక కార్యలాపాలకు పాల్పడితే సంబధిత వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఏదైనా సంఘటన జరిగితే నిర్వహకులు వెంటనే స్థానిక పోలీసులకు జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712657888 లేదా డయల్ 100 కు తెలియజేయాలని అలాగే ప్రజలు సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఎలాంటి వదంతులు పుకార్లను నమ్మవద్దని ప్రజలను కోరారు.
గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలకు మరియు కమిటీ సభ్యులకు మరియు ప్రజలకు తెలియజేయడం ఏమనగా గణేష్ నిమజ్జనం దృష్ట్యా శోభయాత్ర నిర్వహించువారు
ఈ క్రింది సూచనలు తప్పనిసరిగా పాటించాలి.
👉 శోభయాత్రలో DJ సౌండ్ BOX లను ఉపయోగించరాదు.ఇలా ఉపయోగించిన సౌండ్ బాక్స్లను సీజ్ చేయడమే కాకుండా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడును.
👉 శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిటీ వారు మరియు కమిటీ సభ్యులు బాధ్యత వహించవలెను.
👉 విద్యుత్ తీగలను మరియు వచ్చే పోయే వాహనాలను గమనించుకుంటూ యాత్రను నిర్వహించవలెను.
👉 శోభా యాత్రలో అశ్లీల నృత్యాలు గానీ మతవిద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను గాని అట్టి పాటల్ని గాని ప్రదర్శించరాదు.
👉 శోభా యాత్రలో బాణాసంచా కాల్చుట పూర్తిగా నిషేధము ఇట్టి విషయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాము.
👉 నిమజ్జనం సమయంలో నీటి వద్ద తగు జాగ్రత్తలు పాటించవలెను మరియు నీటి వద్దకు చిన్న పిల్లలను రానీయకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ నిమజ్జన కార్యక్రమం చేయవలెను.
👉 రెచ్చగొట్టే నినాదాలు చేయడం మత స్థలాల దగ్గర ఊరేగింపులను ఆపడంవంటివి చేయరాదు.
👉 కనుల పండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదు.
👉 ప్రతి విగ్రహం నిమర్జనం వీలైనంత త్వరగా బయలుదేరాలని వాహనాలపై పరిమితికి మించి భక్తులు వెళ్లకూడదు.
👉 నిమజ్జన రూట్లలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసు సిబ్బందికి అందరూ సహకరించగలరు.
👉 ప్రధానంగా గణేష్ నిమజ్జనం రూట్లో సి.సి కెమెరాల ఏర్పాటు చేయడం జరుగుతోంది.ఈ కెమెరాలు పూర్తిగా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయడం జరిగిందని ఈ సి.సి టివిలు 24×7 ప్రకారంగా పూర్తిగా సిబ్బంది పర్యవేక్షణలో వుంటాయి.
👉 నమజ్జన సమయమున ఏమైనా ఇబ్బందులు తలెత్తినా జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 8712657888 కి గానీ 100 కిగానీ సంప్రదించగలరు.
నిమజ్జనం రోజు ఆయా రూట్లలో విద్యుత్‌శాఖ ఆర్‌అండ్‌బీ శాఖల మరియు ఇతర అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనోత్సవం సాఫీగాసాగేలా భద్రతాపరమైన పూర్తి ఏర్పాట్లు బందోబస్తు చర్యలు చేపట్టామని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.తెలిపారు.