సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
తేది -15-09-2024.
మెదక్ మండలం రాజ్ పల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకులు మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ మార్గం సిద్దిరాములు మరియు హవెలిఘనపూర్ మండలం షమ్నాపూర్ గ్రామానికి చెందిన సిద్దిరాములు ఇటీవల ప్రమాదవశాస్తూ పిడుగు పడి చనిపోయారు.ఈ ఇద్దరు బిఆర్ ఎస్ పార్టీ మెంబర్షిప్ ఇన్సూరెన్స్ చేశారు నామిని అయిన సిద్దిరాములు భార్య మార్గం రాధమ్మ,చెట్ట బోయిన సిద్దిరాములు భార్య బాలమణి ఈ ఇద్దరికీ 2 లక్షల చొప్పున రూ.4,00,000/- బిఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును వారి ఇంటికి వెళ్లి ఆదివారం నాడు మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కార్యకర్త కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కు కొండత భరోసా నిస్తుందని అన్నారు. పార్టీ కార్యకర్త చనిపోతే రెండు లక్షల రూపాయల బీమా అందిస్తున్న ఏకైక పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా మన్నారు.