సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే తక్కువ డేసిబుల్స్ స్పీకర్లను వినియోగించాలి.
అధిక శబ్దాలను వెలువరచే డీజేలు ఉపయోగిస్తే కేసులు నమోదు చేస్తాం
వినాయక నిమజ్జనం లో లేజర్ షో,లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.మాట్లాడుతూ
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.వినాయక చవితి మండపాల నిర్వాహకులకు పీస్ కమిటి సభ్యులకు సూచించారు. అలాగే నవరాత్రులు దగ్గర పడుతున్నందున నిమజ్జనాల ఊరేగింపు సమయంలో తక్కువ శబ్ద కాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలని నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో గాని నిమర్జనం రోజునగానీ అధిక శబ్దాలను వెలువరచే డీజేలను వాడవద్దని ఎస్పీ ఈ సందర్భంగా స్పష్టంచేశారు.అధిక శబ్దాలను వెలువరచే డీజే ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు.సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మాత్రమే తక్కువ డేసిబుల్స్ స్పీకర్లను వినియోగించాలి.అధిక శబ్దాల వల్ల గుండెపోటు వచ్చి చనిపోతున్నారని ఊరేగింపులు ఆనందకర వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు. అలాగే ఈ మద్య కాలంలో వినాయక నవరాత్రి ఊరేగింపు సమయంలో వినాయకుడి ముందు అధిక వెళుతురును ఇచ్చే లేజర్ లైట్ షో ఏర్పాటు చేస్తున్నారని వాటివల్ల వినాయకుడి ముందు నృత్యం చేసే వారి కళ్లలోకి ఆ లేజర్ కిరణాలు పడి కళ్ళు పోయే ప్రమాదం ఉన్నదని కావున ఎట్టి పరిస్థితుల్లో లేజర్ షో లేజర్ లైటింగ్ కి అనుమతి లేదని అలా కాదని ఎవరైనా లేజర్ షో లేజర్ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఏర్పాటు చేసిన వారితో పాటుగా మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కావున పై విషయాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ వారి సూచనలు పాటించి ఏలాంటి ప్రమాదాలకు గురికాకుండా మండపాల నిర్వాహకులు చూసుకోవాలని పండగలను ప్రశాంతంగా జరుపుకునేందుకు నిర్వాహకులు పోలీస్ వారికి సహకరించాలని ఎస్పీ కోరారు.