సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.
హైదరాబాద్ కొంపల్లి లోని వారి నివాసంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు ను హౌస్ అరెస్టు చేసిన కొంపల్లి స్టేషన్ పోలీసులు
ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అక్రమ అరెస్టుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా తమ పార్టీ నాయకులు కార్యకర్తలను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.అరెస్టు చేసిన బీఆర్ఎస్ నాయకులను కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా బిఆర్ఎస్ శ్రేణులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై దాడి చేసిన ఎమ్మెల్యే గాంధీ వారి అనుచరులను కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలన్నారు.అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులను కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేశారు అందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముందస్తు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలి
మెదక్ పట్టణ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి ఆర్కే శ్రీనివాస్ జయరాజ్ హవెలిఘనపూర్ మెదక్ మండల నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయకులు జయరాం రెడ్డి సాపసాయిలు ఆంజనేయులు ప్రభాకర్ ఎలక్షన్ రెడ్డి గంజి నవీన్ శ్రీనివాస్ గౌడ్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.