సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా
తేది 09-09-2024
ప్రజావాణిలో.ప్రజల నుండి 125 ఆర్జీలను స్వీకరించిన కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులు వినతులు ఆర్జీలు సమస్యలను సంబంధిత శాఖల అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా ప్రజల నుంచి మొత్తం -125 దరఖాస్తులు రాగా అందులో రైతు రుణమాఫీకి సంబంధించి 40 ధరణికి సంబంధించి.-30 పింఛన్లకు సంబంధించిన -04 రెండు పడకల గదుల ఇండ్ల కొరకు 08,ఇతరత్రా43 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.
ఈ మేరకు కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా ఒక్కోదానిని పరిశీలించి సంబంధిత అధికారులకు వాటిని అక్కడే అందచేసి ప్రభుత్వ నియమ నిబంధన మేరకు పరిష్కరించాల్సిందిగా సూచించారు.
ప్రజావాణి సమస్యలను పరిష్కరించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించారాదని ఆర్జీలు అందచేసినవారు తిరిగి రెండోసారి రాకుండా సమస్యలను
పరిష్కరించాల్సిందిగా తెలిపారు. దీంతో పాటు సమస్యల పరిష్కారానికి వీలులేనట్లయితే తదుపరి చర్యల కోసం వారికి అర్ధమయ్యే విధంగా తెలియజేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అధికారులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు జడ్పీసీఈఓ ఎల్లయ్య శ్రీనివాసరావు జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.