మహాత్మ జ్యోతిబాపూలే ప్రజాభవన్ హైదరాబాద్ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈ నెల 11వ తేదీకి వాయిదవేసినట్టు ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య తెలిపారు.
సిల్వర్ రాజేష్ స్టూడియో10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతీ మంగళవారం,శుక్రవారం నిర్వహిస్తున్నామన్నారు.అయితే ఈ నెల 10వ తేదీన ప్రజాభవన్ లో 16వ కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని మంగళవారం నుంచి
బుధవారానికి మార్చినట్టుతెలిపారు.
జిల్లా నుండి హైదరాబాద్ ప్రజాభవన్ ప్రజావాణి కార్యక్రమానికి వెళ్ళే ప్రజలు ఇట్టి విషయాన్ని గమనించాలని ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య వివరించారు.