అధిక వర్షాలు కారణంగా యుద్ధ ప్రాతిపదికన నష్టాలను అంచనా వేసి ప్రభుత్వం ద్వారా సహాయ సహకారాలు అందజేస్తామని మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు.
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
మంగళవారం అకాల వర్షాలు వరదలతో జిల్లాలో ఏర్పడిన నష్టాలను క్షేత్రస్థాయిలో
హవేలి ఘన్పూర్ మండలం దూప్ సింగ్ తాండ బ్రిడ్జ్ వరద నీటితో కోతకు గురైన సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించి
పరిశీలించి ప్రజలకు భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు వలన
జిల్లాలో ప్రజలు ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి నష్టాలను అంచనా వేస్తున్నారని చెప్పారు. కోతకు గురైన బ్రిడ్జ్ వర్క్ ను
పాత కాంట్రాక్టర్ను తొలగించి, టెండర్ పిలిచి కొత్త కాంట్రాక్టర్ ద్వారా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని
రోడ్డు మరమ్మతులు విషయంలో వర్షాలు
తగ్గిన వెంటనే మరమ్మత్తులు చేపట్టి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉపయోగంలోకి తీసుకురావాలని పంచాయతీరాజ్ E.E నరసింహులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మాట్లాడుతూ వర్షాలు వరదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకృతి వైపరీత్యాలు అకాల వర్షాలు కురుస్తాయని
వాతావరణ శాఖ హెచ్చరించిన మేరకు వివిధ శాఖల సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకుని ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూ క్షేత్రస్థాయిలో
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహించి ప్రజలకు సహాయ సహకారాలు అందించారని చెప్పారు.ఆస్తి నష్టం పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తున్నట్లు చెప్పారు
ఈ కార్యక్రమంలో తాసిల్దార్ నవీన్ పంచాయతీరాజ్ E.E నరసింహులు డి.ఈ పాండురంగారావు సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు