మీ భద్రతే మా భాద్యత
మీ కోసమే మెదక్ జిల్లా పోలీస్
జిల్లా QRT (Quick Response Team)
వరదలో చిక్కుకున్న వ్యక్తిని ప్రాణాలకు తెగించి కాపాడిన జిల్లా పోలీసులు
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.*
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా
తేది -03-09-2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ..తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద పోటెత్తుతోంది. చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో భారీ వరదలతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
దీంతో జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం జలదిగ్భందమయ్యాయి. అయితే వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు జిల్లా పోలీసు సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నిరంతరాయంగా పనిచేస్తూ వరదల్లో చిక్కుకుపోయిన ప్రజల్ని రక్షిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే.. వరద నీటిలో చిక్కుకున్న ఓ వ్యక్తిని కాపాడేందుకు.ఈ రోజు మెదక్ జిల్లా QRT Quick Response Team పోలీసులు, గ్రామ యువకులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. ఈ ఘటన మెదక్ జిల్లా టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిది గుండు వాగులో చోటుచేసుకుంది. వాగు పొంగిపొర్లుతుండగా.. అటుగా వెళ్లిన ఓ వ్యక్తి నీటిలో కొట్టుకుపోయాడు.. సమచారం అందుకున్న మెదక్ జిల్లా QRT Quick Response Team పోలీసులు వెంటనే స్పందించారు. టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిది గుండు వాగులో 45 ఏళ్ల ఓ వ్యక్తి బ్రిడ్జిని దాటడానికి ప్రయత్నిస్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు.వాగులో కొట్టుకుపోతూ వాగు లోపల ఓ బండ రాయిని పట్టుకొని ఆగిపోయాడు.ఈ క్రమంలో అతడిని గమనించిన మెదక్ జిల్లా QRT Quick Response Team సబ్యుడు మహేష్ హెచ్.జి 96 గారు వెంటనే రంగంలోకి దిగారు. జిల్లా QRT Quick Response Team సబ్యుడు మహేష్ హెచ్.జి 96 మరో ఇద్దరు యువకులు తాడు సహాయంతో కల్వర్టు మధ్యలోకి చేరుకోగా, అందరూ ఒక జట్టుగా ఏర్పడి ఆ వ్యక్తిని వరద ప్రవాహాం నుంచి తాడు సహాయంతో బయటకు తీసుకువచ్చారు. ఆ వ్యక్తిని నెమ్మదిగా నీళ్లలోంచి బయటకు తీసి సురక్షితంగా వాగులో నుండి బయటకు తీశారు.తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన జిల్లా QRT Quick Response Team సబ్యుడు మహేష్ హెచ్.జి ని యువకులను జిల్లా QRT Quick Response Team సిబ్బందిని ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. అభినందించినారు.
ఈ కార్యక్రమం పాల్గొన్న క్యుఆర్టి మెదక్ జిల్లా సబ్యులు Quick Response Team
1). బండి శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్
2). సురేష్ నాయక్ పోలీస్ కానిస్టేబుల్*
3). కృష్ణ పోలీస్ కానిస్టేబుల్
4). రమేష్ పోలీస్ కానిస్టేబుల్
5). మహేష్ హోమ్ గార్డ్ తదితరులు పాల్గొన్నారు