సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టివి ప్రతినిధి మెదక్ జిల్లా.
తేది 30-08-2024.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో పారిశ్రామిక పార్కు స్థాపన కోసం భూ పరిహార విషయంలోపట్టేదార్లు/భూ యజమాను లతో సమావేశం లో జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు.
శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో తూప్రాన్ తాసిల్దార్ విజయలక్ష్మి కలెక్టర్ కార్యాలయ భూ సేకరణ సూపరిండెంట్ ప్రసాద్ మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామ పట్టేదారు భూ యజమానులతో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు సమావేశం నిర్వహించారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేపట్టడం వల్ల
25 ఎకరాల10 కుంటల భూమి పోతుందని దాని న్యాయమైన పరిహారం ఇప్పించాలని పట్టేదారు భూ యజమానులు అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.చైర్మన్ DLNC & జిల్లా కలెక్టర్ మెదక్ GO.Ms.No లో ఉన్న షరతుల ప్రకారం సమ్మతి అవార్డుపై వారి భూములను ఇవ్వడం ద్వారా అభివృద్ధి ప్రక్రియలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన పట్టేదార్లు/భూ యజమానులను అభినందించారు.
మేడ్చల్ – సిద్దిపేట జోన్ TGIIC, హైదరాబాద్ Sy కింది భూములు.మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ స్థాపన కోసం కొనుగోలు చేయనున్నారని తెలిపారు.
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణం చేపట్టడం వల్ల భూ పరిహార విషయంలో జిల్లా కలెక్టర్ గారితో సంప్రదించి సమస్యను పరిష్కరిస్తానని అన్నారు.గుండ్రెడ్డిపల్లి గ్రామ పట్టాదారు భూ యజమానులు సమన్వయంతోఉండాలన్నారు. వారికి ప్రభుత్వం నుంచి రావవలసిన ప్యాకేజీ విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టేదారు భూ యజమానులు అంజాగౌడ్ కయ్యం బుచ్చిరెడ్డి ఇతర పట్టేదార్లు తదితరులు పాల్గొన్నారు.