సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
తేది 26- ఆగస్ట్ -2024
జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పోలీస్ కళా బృందం వారు అల్లదుర్గ్ సర్కిల్ అల్లాదుర్గ్ పోలీసు స్టేషన్ పరిధిలోని KGBV నందు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.
బాలబాలికలు చదువుపై దృష్టి పెట్టి క్రమశిక్షణతో కృషి చేయడం వలన ఉత్తమ భవిష్యత్తు లభిస్తుందని పోలీసు కళా బృందం సభ్యులు పాటలు, మాటలతో విద్యార్దులకు వివరించారు.
సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలు గిఫ్ట్ లు వచ్చాయని మీరు లక్కీ డ్రా లో గెలుపొందారని ఆన్లైన్లో తక్కువ ధరకే వాహనాలు వస్తువులు దొరుకుతాయని మోసం చేయడం జరుగుతుంది. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి మీ పేరు మీద మా యాప్ లో లోన్ వచ్చిందని లేదా మీకు QR కోడ్ పంపించి దానిని స్కాన్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పిన యెడల నమ్మకండి.అది సైబర్ మోసం అని తెలుసుకోండి. ఇంటర్నెట్లో ఓటీపీ నంబర్ గానీ బ్యాంక్ కార్డ్స్ నంబర్ గానీ ఎవరికీ పంపవద్దని ఒకవేళ ఎవరైనా సైబర్ నేరానికి గురైనట్లయితే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 కి లేదా జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 57888 కి లేదా సంబంధిత పోలీసు స్టేషన్ కు కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
గంజాయి మొదలగు మత్తు పదార్థాల అక్రమ రవాణా మరియు వినియోగం వలన భవిష్యత్తులో యువత ప్రమాదంలో పడుతుందని మత్తు పదార్థాల బారిన పడి ఎంతోమంది యువత భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారుతోందని కొంతమంది యువత జల్సా జీవితంతో పాటు సులభంగా డబ్బు సంపాదన కోసం అక్రమ మార్గంలో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలను (Drugs) విక్రయిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి నేరస్తులతో పాటు మత్తు పదార్థాలను వినియోగించే వ్యక్తులకు చట్టపరమైన శిక్షలు తప్పవని సమాజంలోని మనందరం కలిసికట్టుగా పనిచేస్తూ భవిష్యత్తులో జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలని జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్ సంకల్పాన్ని పోలీసు కళాబృందం వారు తెలియజేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా మరియు అమ్మకాల సమాచారాన్ని సంబంధిత పోలీసు స్టేషన్ కు గానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నెంబర్ 87126 57888 కి గానీ దగ్గర లోని పోలీస్ స్టేషన్ వారికి సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని అన్నారు.
బాల్య వివాహాల వలన అనేక అనర్థాలు జరగుతున్నాయని ఎవరూ బాల్య వివాహాలు చేసుకోవద్దని ఎవరైనా అలా చేయాలని ప్రయత్నించినచో చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్-1098 కు ఫోన్ చేయాలని కోరారు. అలాగే యువత సామాజిక మాధ్యమాలు మొబైల్ ఫోన్లు మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలియజేస్తూ మైనర్లు లైసెన్సు లేనివారు మద్యం తాగినవారు ఎలాంటి వాహనం నడిపకూడదని రోడ్డు ప్రమాదాల వలన అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాటిని మనందరం నివారించేందుకు కృషి చేద్దామని తెలిపారు.
రకరకాల పద్దతులలో మాయమాటలు చెప్పి పిల్లలను అమ్మాయిలను యువతను మహిళలను అక్రమ రవాణా చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అలాంటి అనుమానితులు ఉంటే వెంటనే సంబంధిత పోలీసులకు లేదా డయల్-100కు ఫోన్ చేసి తెలియజేయాలని తెలిపారు.
మన జిల్లా ప్రజలు ముఖ్యంగా యువత బాలబాలికలు గొప్పగా చదువుకుని ఎదగాలనీ పోలీసు కళాబృందం సభ్యులు పాటలతో మాటలతో తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆల్లదుర్గ్ ఎస్.ఐ.ప్రవీణ్ రెడ్డి,పోలీసు కళా బృందం సభ్యులు సురేందర్ పాల్గొన్నారు.