జోగులాంబ గద్వాల జిల్లా:
అమ్మ హాస్పిటల్ దగ్గర విద్యుత్ స్తంభం తో పొంచి ఉన్న ప్రమాదం అనే కథనం సోమవారం ఉదయం సోషల్ మీడియా ద్వారా తెలియపరచగా ఈ కథనానికి విద్యుత్ అధికారులు స్పందించి అట్టి విద్యుత్ స్తంభము నుంచి ఏలాంటి ప్రమాదం జరగకుండా గట్టి సిమెంట్ బెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా తెలియపరచిన వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి చర్యలు చేపట్టినందుకు సోషల్ మీడియా ద్వారా గద్వాల పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు.