-బిజెపి నాయకులు పడకండ్ల నాగేశ్వరరావు..
స్టూడియో 10 టీవీ న్యూస్, ఆగస్టు 25, మహానంది:
మహానంది మండలం గాజులపల్లె గ్రామ ప్రజలకు బిజెపి నాయకులు పడకండ్ల నాగేశ్వరరావు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కృష్ణభగవానుడి జన్మదినం హిందువులకు పర్వదినమని అన్నారు. గోకులాష్టమిగా, ఉట్ల పండుగగా ప్రజలు జరుపుకొనే శ్రీకృష్ణ జన్మదినానికి పురాణేతిహాసాల్లో ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. కష్ట సుఖాలు, మంచి చెడులు, లాభ నష్టాలకు అతీతంగా అన్ని సందర్భాల్లోనూ, ఒకేవిధమైన ప్రవర్తనను కలిగి ఉండే, స్థితప్రజ్ఞతను సాధించడం శ్రీకృష్ణతత్వంలోని పరమార్థమని బిజెపి నాయకులు నాగేశ్వరరావు తెలిపారు. మన సాంస్కృతి సంప్రదాయాలకు, శ్రీకృష్ణతత్వం ప్రతిక అని, సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.