సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా.
రైతులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనిర్వహించచారు
ఈ ధర్నాలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు
కావున మున్సిపల్ చైర్మన్ లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్ లు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు మాజీ చైర్మన్లు ఎంపీపీలు జడ్పీటీసీ లు సర్పంచ్ లుఎంపీటీసీలు పట్టణ గ్రామ కమిటీ అనుబంధ కమిటీ అధ్యక్షులు సభ్యులు బిఆర్ఎస్వి నాయకులు కార్యకర్తలు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.
పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ
కెటిఆర్ పిలుపుమేరకు రైతులకు రూ 2 లక్షల రుణమాఫీ చేయాలని ఉద్యమిస్తున్నాం .
చీటింగ్ చేసిన రేవంత్ సర్కార్ పై ఉద్యమిస్తాం.
14 ఏండ్లు పోరాటం చేసి కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించాం.
కేసీఆర్ పడేండ్లు అనేక పథకాలు ప్రవేశ పెట్టారు.
మాయ మాటలతో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు.
డిసెంబర్ 9 న రూ 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిండ్రు.
ఆరు గ్యారెంటీలు అంతా ఉత్తదే.
కేసీఆర్ కు రేవంత్ కు పొలికనా.
అన్ని వర్గాల ప్రజలను మోసం చెంసిండ్రు .
రూ 49 వేల కోట్లు అయితేనే రైరులందరికి రుణమాఫీ అవుతుంది.
ఇప్పటివరకు రైతులకు రూ 7 వేల కోట్లు మాఫీ చేశారు.
17 సార్లు కేసీఆర్ రైతు బంధు ఇచ్చారు.
మాయ మాటలతో కాంగ్రెస్ నేతలు మభ్యపెడుతున్నారు.
హరీష్ రావు రాజీనామా చేస్తా అంటేనే ఈ మాత్రమైన రుణమాఫీ అయింది.
ఆర్థిక అంశాలపై సీఎం రేవంత్ కు అవగాహన లేదు.
రుణమాఫీ జరగకపోయిన కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు మాఫీ చేస్తున్నారు.
మంత్రులు తలోమాట మాట్లాడుతున్నారు గ్రీవెన్స్ అంటూ రైతులను మభ్యపెడుతున్నారు.
రుణమాఫీ పై హైడ్రామా..సీఎం రాజీనామా చేయాలి.
ఒకసారి గ్రామాల్లోకి వచ్చి చూడండినేటికి రైతు బంధు పడలే
రైతులను గుండెల్లో పెట్టి చూసుకుండు కేసీఆర్.
రైతులు రోడ్డెక్కి శాపనర్దాలు పెడుతున్నారు.రైతుల ఉసురు తగులుతది.
ఇది ఆరంభం మాత్రమే ప్రజలకోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం .
అభివృద్ధి చేయకుండా దాడులకు పాల్పడుతున్నారు
రాబోయే కాలంలో గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు తిరుగులేని పరిస్థితి .
ఖబర్దార్ రేవంత్ రుణమాఫీ జరిగేంతవరకు పోరాడుతాం.
సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం కాదని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని చూస్తున్నారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు.
ఫ్రీ బస్సు పథకంలో బస్సులు పెంచండి.
రుణమాఫీ చేయకుంటే వారం రోజుల్లో మండలాల వారిగా ఆందోళనలు చేస్తాం.
ఆగస్టు 15 కూడా గంగల కలిసింది.
రుణమాఫీ చేయకుంటే మంత్రులు రాజీనామా చేయాలి.
లోకల్ ఎమ్మెల్యే సిద్ధిపేట పోయి ఏం చేస్తావ్. ఇక్కడిరైతుల రుణమాఫీ చేయించండి.
కనీసం కాంగ్రెస్ కు సంబందించిన రైతుల రుణమాఫీ చేయాలి.
ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి ఎమ్మెల్సీ శేరి.సుభాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి నాయకులు కాంఠరెడ్డి తిరుపతి రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ లు పాల్గొననున్నారు.