రెవిన్యూ పాలన అత్యంత పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్ 16 ఆగస్టు 2024.

సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి మెదక్


రెవిన్యూ పాలన అత్యంత పారదర్శకంగా జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం తూప్రాన్ ఆర్డీవో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఫైల్స్ నిర్వహణ ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ మేనేజ్మెంట్ R.R.R రెవిన్యూ కలెక్షన్ ప్రజలకు కావాల్సిన కనీస అవసరాల గురించి సిబ్బంది పనితీరు సంబంధిత విషయాలను ఆర్డీవోను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ కార్యాలయ పనితీరు ప్రజలకు ఆదర్శంగా ఉండాలని వివిధ సమస్యలపై కార్యాలయానికి వచ్చే ప్రజలకు వారి సమస్యలను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించాలన్నారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ జై చంద్రారెడ్డి సంబంధిత రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!