రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 15:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ గోల్పర్తి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ భవాని శంకర అన్నప్రసాద వితరణ సేవా క్షేత్రంలో నాగభూషణం చారి ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని గురువారం విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ జాతీయ జెండాను పతాకావిష్కరణ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజును మనమందరం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆనాడు స్వాతంత్రం తెచ్చిన మహనీయుల త్యాగ ఫలితమే ఈరోజు మనమందరం స్వాతంత్ర భారత దేశంలో నివసిస్తున్నామని గర్వంగా చెప్తున్నామన్నారు.గాంధీజీ కలలుగన్న దేశంగా పేరొందిన భారతదేశములో మనమందరము రాజ్యాంగం పొందుపరిచిన స్వేచ్ఛ హక్కులను కాలరాయకుండా వాటిని అనుసరించి నడిచినప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుందని వారు వెల్లడించారు. ప్రతి ఒక్కరు మన దేశంలో కుల మత భేదం లేకుండా కలిసి మెలసి ఐక్యంగా ఉండి ప్రేమ అనురాగాలతో ప్రతి ఒక్కరు నడుచుకొని సమాజసేవకు నడుము కట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ మాతృ శక్తి అధ్యక్షురాలు అనంతలక్ష్మి,శ్రీ భవాని శంకర అన్న ప్రసాద వితరణ సేవా క్షేత్రం సభ్యులు మైలవరం రుచిత వేణుమాధవ్, ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్లు, బిజెపి నాయకులు భారత్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, రాజేశం,శమంత పాల్గొన్నారు.