రామాయంపేట (స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు15:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంతో పాటు డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులు పట్టణంలో పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించి విద్యార్థులు జాతీయ గీతాలతో అల్లరింపజేసి ఆకట్టుకున్నారు.అనంతరం సిద్ధిపేట చౌరస్తా వరకు విద్యార్థులు భారీ ర్యాలీతో వెళ్లి స్వామి వివేకానంద విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు.అదేవిధంగా రామాయంపేట తహసిల్దార్ కార్యాలయం వద్ద మండల తహసిల్దార్ రజినీకుమారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద సిఐ.వెంకట రాజాగౌడ్, మున్సిపాలీటీ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎంపీడీవో కార్యాలయం వద్ద మండల ఎంపీడీవో షాహిలోద్దీన్, మండల వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద డివిజన్ వ్యవసాయాధికారి వసంత సుగుణ, ప్రాథమిక సహకార సంఘం వద్ద సొసైటీ చేర్మెన్ బాదే చంద్రం,మండల ఎంఈఓ కార్యాలయం వద్ద షాహీనొద్దీన్ వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల వద్ద ప్రధానోపాధ్యాయులు,కళాశాలల వద్ద ప్రిన్సిపాల్స్ వివిధ పార్టీలకు చెందిన నాయకులు జాతీయ జెండాలను ఎగురవేసి స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్నారు.