యువ కార్యకర్తను కోల్పోవడం చాలా బాధాకరం మంత్రాలయం టిడిపి ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి సోదరులు ఎన్.రఘునాథ్ రెడ్డి
మంత్రాలయం ప్రతినిధి (ఆగష్టు 13):- మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో మామిడి జాన్ టిడిపి కార్యకర్తకు నాలుగు రోజుల కింద జరిగిన బైక్ యాక్సిడెంట్ వలన హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న స్వర్గస్తులయ్యారు. ఆ విషయం తెలుసుకున్న మాధవరం మాజీ సర్పంచ్ ఎన్.రఘునాథ్ రెడ్డి గారు జాన్ మృతీదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జాన్ కుటుంబ సభ్యుల దగ్గర మాట్లాడుతూ మాధవరం రామ్ రెడ్డి గారి కుటుంబం మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటుందని 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇస్రీయెల్, ఆరోని, ఆనంద్,ప్రసాద్,రవి, యాకోబు పాల్గొని నివాళిలు అర్పించారు.