స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సిల్వర్ రాజేష్ స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా
ఆగస్ట్ -14-2024.
మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను బుదవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తో కలసి పరిశీలించారు. మైదానాన్ని పూర్తిస్థాయిలో శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. జెండా ఏర్పాట్లు మైదానం సిద్ధం చేయడం మొదలగు ఏర్పాట్లను పోలీస్ రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. శకటాలు తిరిగే ప్రదేశమును ఏర్పాటు చేసే స్థలాలను చూశారు. వేదిక సభకు హాజరయ్యే వారు కూర్చోవడానికి సిట్టింగ్ ఏర్పాట్లు పగడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. వాహనాల పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చూడాలన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించాలన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని శాఖల అధికారులు సిబ్బంది విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా విద్యుత్ అధికారులు చూసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డిఓ రమాదేవి అదనపు ఎస్పీ మహేందర్ మెదక్ డి.ఎస్.పి ప్రసన్నకుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.