కర్ణాటక రాష్ట్రం లో హోస్పేట్ దగ్గర ఉన్న ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సాగు, తాగునీరు అందించే తుంగభద్ర డ్యామ్. 19వ డేటు ప్రమాదవశాత్తు కొట్టుకొని పోవడానికి బోర్డు పరిధిలో ఉన్న అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినదని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య అన్నారు. గేట్ పడిపోయి వరద నీరు వృధాగా సముద్రం పాలు అవుతున్నాయి. డ్యాంకు మొత్తం 33 గేట్లలో ఒక గేటు కొట్టుకుపోవడంతో మిగిలిన 32 గేట్లు ఎత్తి 105 టీ ఎం సీల నుంచి 60, 65 టీ ఎం సీలు నీళ్లు దిగునకు వదులుతున్నారు. ఈ సంవత్సరం సాగునీరు లేక వ్యవసాయం ప్రశ్నార్థకం అవుతుంది అని అన్నారు.
ప్రతి సంవత్సరం డ్యామ్ గేట్లు వార్షిక తనిఖీ నిర్వహిస్తారు .ఈ సంవత్సరం కూడా మే నెలలో ఇంజనీర్లు తనిఖీ చేశారు .గేట్లు నిర్వాణ సక్రమంగా లేదని ప్రత్యామ్నాయంగా గేట్లు ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు హెచ్చరించినారు. అయినా తుంగభద్ర బోర్డు అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటన జరిగినదని ఆయన అన్నారు. డ్యామ్ గేట్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని విశ్రాంతి ఇంజనీర్ కన్నయ్య నాయుడు పరిశీలించినారు తుంగభద్ర డ్యామ్ గేట్లు నిర్మాణ పనులు జరిగేటప్పుడు ఆయన ఇంజనీర్ గా ఉన్నారు. డ్యామ్ చరిత్రలోనే ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటి సారి అని ఆయన అన్నారు.
ఈ డ్యాం గేటు పడిపోవడానికి కారణమైన తుంగభద్ర బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కే మల్లయ్య డిమాండ్ చేసినారు..