రామాయంపేట ( స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 3:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శనివారం రోజు రామాయంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట మున్సిపాలిటీలో కోమటిపల్లి రెండో వార్డులో ఎస్సీ వర్గీకరణ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ కి,30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా రామాయంపేట బిజెపి పట్టణ అధ్యక్షుడు దమ్మయ్య గారి భానుచందర్ మాట్లాడుతూ ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందన్నారు.ఎస్సీ వర్గీకరణలో అందరూ సమానమే ఎస్సి మాలా మాదిగ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ హక్కులకు కట్టుబడి వారు ఉన్నత స్థాయికి ఎదగడానికి మోడీ ప్రభుత్వం కృషి చేసిందని పేర్కొన్నారు.ఇది దేశంలోనే చాలా చరిత్రత్మకం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు జంగంపల్లి శంకర్ గౌడ్, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, సీనియర్ నాయకులు వెలుముల సిద్ధరాములు,ప్రధాన కార్యదర్శి అవినాష్ రెడ్డి,ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొత్తపల్లి ప్రవీణ్ బూత్ అధ్యక్షులు కన్నయ్య,వినయ్,భరత్ కొత్తపల్లి యాదగిరి రమేష్ ప్రశాంత్ నర్సింలు దుర్గయ్య మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు.