స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్రాహుల్ రాజ్

సిల్వర్ రాజేష్ (స్టూడియో 10 టీవీ ప్రతినిధి మెదక్ జిల్లా)

జిల్లాలో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య డిపిఓ యాదయ్య జిల్లాలోని ఎంపీడీవోలు ఎంపీ ఓలు పంచాయతీ సెక్రటరీలతో కలసి ఈనెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం పచ్చదనం వనమహోత్సవం అమలుతీరు చేపట్టాల్సిన వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. 

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఐదు రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో రోజువారీగా చేపట్టాల్సిన పనులపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమ నిర్వహణ పటిష్టంగా జరుగుటకు మండల స్థాయిలో జిల్లా పరిషత్ సీఈఓ డిఆర్డీఓ పట్టణాల్లో మునిసిపల్ కమిషనర్లు పర్యవేక్షించాలని అన్నారు.స్థానిక ప్రజా ప్రతి నిధులు స్వయం సహాయక సంఘాలు యూత్ మరియు వార్డు కమిటీ సభ్యులతో సమావేశాలు నిర్వహించి అందరినీ భాగస్వాములను చేయాలన్నారు.వ్యక్తిగత పరిశుభ్రత సీజనల్‌ వ్యాధులు ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలన్నారు.
ప్రభుత్వ సంస్థలు పాఠశాలలు అంగన్‌వాడీలు వసతి గృహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్లలో పారిశుధ్య పనులతోపాటు,ప్రతి శుక్రవారం డ్రైడే గా పాటిస్తూ మురుగు కాలువలను శుభ్రం చేయించాలన్నారు.నీరు నిలిచిన ప్రాంతాల్లో ఆయిల్‌బాల్స్‌ వేసి దోమల వృద్ధిని అరికట్టాలన్నారు.
తాగు నీటి వర్షపు నీటి సంరక్షణ కార్యక్రమంలో భాగంగా మంచినీటి ట్యాoకు శుభ్రత మంచినీటి సరఫరా నిర్ణీత మోతాదులో క్లోరికేషన్ చేసేలా చూడాలని 300 చదనపు గజాల ప్లాట్ ఉన్న భవనాలు వర్షపు నీటి నిలువ ఏర్పాట్లను చేయాలని అన్నారు.సీజనల్ వ్యాధులనివారణ చర్యలు గ్రామాలలో ఫివర్ సర్వే నిర్వహణ దోమల నివారణకు అయిల్ బాల్స్ ను తయారు చేయించి చేసి మురుకి నీటి నిలువలలో వొదిలే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ‘స్వచ్ఛదనం-పచ్చదనం’పై విద్యార్థులకు వ్యాసరచన, పద్య గేయాల పోటీలు నిర్వహించి బహుమతులను అందించి ప్రోత్సహించాలని కలెక్టర్‌ డీఈవోకు సూచించారు.

వన మహోత్సవం కింద గ్రామ పంచాయతీలు మునిసిపాలిటీలు పట్టణాల్లో పెద్ద సంఖ్యలో మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్‌ నిమిత్తం అనువైన స్థలాలను గుర్తించాలన్నారు. ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటేందుకు ప్రతి ఇంటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ భోజి డిఎం అండ్ హెచ్ ఓ శ్రీరామ్ ఇరిగేషన్ శ్రీనివాసరావు ఈ ఈ పి ఆర్ నర్సింలు ఎస్సీ కార్పొరేషన్ విజయలక్ష్మి, డి.టిడబ్ల్యు.ఓ.నీలిమ మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!