రామాయంపేట ( స్టూడియో 10 టీవీ ప్రతినిధి) ఆగస్టు 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ సర్పంచ్ లను చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరుతున్న వారిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ సర్పంచులు మాట్లాడుతూ 2019-2024 సంబంధించిన సర్పంచులము గత ఐదు సంవత్సరాలుగా గ్రామాలలో చేసినటువంటి అభివృద్ధి పనులకు తమకు బిల్లులు చెల్లించలేదని అన్నారు.నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్న గ్రామాల్లో పని చేసిన దానికి పెండింగ్ లో ఉన్న బిల్లులు ఇంతవరకు అసలు ఇవ్వలేదన్నారు.గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడుతూ ముందుకు సాగుతున్న తమకు అప్పులు కుప్పలు చేసి తాము గ్రామాలు అభివృద్ధి పరుచుకొని ముందుకు వెళ్తున్నాం అన్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ సర్పంచులు 12,769 మంది ఉన్నారని మా ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచుల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కొడ్ కు ముందుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో సర్పంచులు చేసినటువంటి పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలు బయలుదేరుతున్న తమను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారని వారు తెలియపరచారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచులు ఉమామహేష్ స్వామి సుభాష్ నర్సాగౌడ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.