గిద్దలూరు మండలం గిద్దలూరు అర్బన్ కాలనీ పవర్ సబ్ స్టేషన్ రోడ్ మరియు కాలనీ లోపల కొన్ని రోడ్లు పూర్తిగా నీళ్లమయమై యున్నవి. ప్రజలు నడవడానికి, చిన్న పిల్లలు పాఠశాలలకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మోటర్ సైకిల్స్ పై నడవడం ఈ రోడ్లలో చాలా కష్టముగా ఉన్నది. మోటర్ సైకిల్స్ అయితే ఇండ్లకు దూరంగా బురదలేని దగ్గర రాత్రిపూట పెట్టుకోవలసి వస్తున్నది. కావున అర్బన్ కాలనీ వాసుల మొఱ విని ఆలకించి కాలనీకి సిమెంట్ రోడ్లు మంజూరు చేయవలసినదిగా తగిన అధికారులకు విన్నవిను కొనుచున్నాము.
ఇట్లు
అర్బన్ కాలనీ వాసులు,
గిద్దలూరు, ప్రకాశం జిల్లా.