సిల్వర్ రాజేష్ (స్టూడియో 10 టీవీ న్యూస్ ప్రతినిధి మెదక్ జిల్లా)
రామాయంపేట జిల్లా పరిషత్ బాలుర పాఠశాల భవనాన్ని, ఇతర ప్రభుత్వ భవనాలను అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు పరిశీలన
ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు రామాయంపేట మున్సిపాలిటీలో అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు విస్తృత పర్యటన ఈ రోజు గురువారం రామాయంపేట జిల్లా పరిషత్ బాలుర వసతిగృహా మరమ్మత్తులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రతి విద్యార్థి సమగ్రాభివృద్ధికి అధికారులు పట్టిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు మెదక్ జిల్లా రామాయంపేట మండలం లో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. వసతి గృహంలోని తరగతి గదులు వంట గది భోజన శాల డార్మెంటరీ లను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. రామాయంపేట జిల్లా పరిషత్ బాలుర వసతి గృహాన్ని,ఇతర ప్రభుత్వ భవనాలను సందర్శించడం జరిగిందని శిథిలావస్థలో ఉన్న భవనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు భాగంగా సంబంధిత ఇంజనీర్ల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి మరమ్మత్తులు చేయించి ఉపయోగం లోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయని విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్యను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలలోని తరగతి గదిలో విద్యార్థుల విద్యాప్రమాణాలను అదనపు కలెక్టర్ పరీక్షించారు. ప్రతి విద్యార్థి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయాలని అదనపు కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ ,రామాయంపేట తాసిల్దార్ రజని సంబంధిత మండల విద్యాశాఖ అధికారి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.