ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గిద్దలూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పదో వార్డులో తుమ్మలపెంట వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో వార్డు సచివాలయ సిబ్బంది పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించారు.
టిడిపి నాయకులు తుమ్మలపెంట వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పెన్షన్లు అమలు చేసిన ఘనత టిడిపి పార్టీ దేనని గిద్దలూరుఅభివృద్ధి పథంలో దూసుకొని వెళ్లాలంటే పేద బడుగు బలహీన వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందాలంటే గిద్దలూరు రథసారధి ఒక ముత్తుముల అశోక్ రెడ్డి కే సాధ్యమని తెలిపారు.