తెలంగాణ గవర్నర్ గా గౌరవ జిష్ణుదేవ్ వర్మ గారి చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అలోక్ ఆరాధే గారు పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.