ఆగస్టు 6, 7, తేదీల్లో చలో ఢిల్లీ
టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిర్సనోళ్ల బాల్ రాజ్ మాదిగ
TMRPS,TMSF సంయుక్త ఆధ్వర్యంలో ఛలోడిల్లీ కరపత్రాలను షాద్ నగర్ MPDO ఆవరణలో విడుదల
ఎస్సి వర్గీకరణ బిల్లు పార్లమెంట్ సమావేశ లలో ప్రవేశ పెట్టాలి అని డిమాండ్ చేస్తూ ఆగస్టు 6,7 వ తేదీలలో జరిగే చలోఢిల్లీలో దీక్ష, ధర్నా, కార్యక్రమం ఉందని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిందిగా TMSF, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జాంగారి రవి మరియు TMRPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాగ జంగయ్య మాదిగ సందర్బంగా మాట్లాడుతూ ఇప్పుడు జరిగే పార్లమెంటు వర్షకాల సమావేశంలో బిల్లు ఆమోదం పొందే విధంగా చర్యలు చేపట్టాలి. ఎస్.సి. వర్గీకరణ చట్టబద్ధత కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా సానుభూతితో కూడిన సరైన నిర్ణయం తీసుకొని భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బలపరుస్తూ పెద్ద సామాజికవర్గమైన మాదిగ (చమార్), మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని గతంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తక్షణమే ఎస్.సి. వర్గీకరణ బిల్లు ఉషామెహ్రా కమిషన్ ఆధారంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎస్.సి.ల జనాభా దామాష ప్రకారం ఎ, బి, సి, డి, బిల్లు పార్లమెంటు సమావేశాల్లో చట్టబద్ధత పొందే విధంగా చూడాలని కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగపాగ జంగయ్య మాదిగ, రాష్ట్ర నాయకులు మాచరం మసయ్య మాదిగ జిల్లా కర్రే కృష్ణయ్య మాదిగ , భీంరాజ్ మాదిగ, బాల్ నరసింహ మాదిగ, తుంగ.శ్యామ్ మాదిగ, రాజు మాదిగ,TMSF నాయకులు దాసరి శివ, వరప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.