సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).
తేది – 05.07.2024.
ట్రాక్టర్ కేజ్ వీల్స్ తో రోడ్లపైకి వస్తే చర్యలు: డా.బి.బాలాస్వామి ఐ.పి.ఎస్
ఈ రోజు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో మెదక్ జిల్లా ఎస్.పి డా.బి.బాలాస్వామి ఐ.పి.ఎస్ గారు మాట్లాడుతూ… ట్రాక్టర్‌లను కేజ్ వీల్స్ తో బీటీ రోడ్లు,CC రోడ్లపై నడిపడం వల్ల రోడ్లు డ్యామేజి అవుతాయాని అలా ట్రాక్టర్‌లను కేజ్ వీల్స్ తో బీటీ రోడ్లు, CC రోడ్లపై నడిపే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ప్రభుత్వం ఎంతో వ్యయంతో ప్రజలకు మెరిగైన సుఖవంతమైన ప్రయాణం కోసం రోడ్లను ఏర్పాటు చేసిందని కొందరు ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పని చేయడానికి కేజ్ వీల్స్‌ను రోడ్లపై ఉపయోగించడం వల్ల రోడ్లు ద్వంసం అవుతున్నాయని కాబట్టి ట్రాక్టర్ యజమానులు పొలాల్లో పనుల నిమిత్తం వెళ్ళేటప్పుడు తమ ట్రాక్టర్లను కేజ్ వీల్స్ తో రోడ్డుపై నడపవద్దని అలా నడపడం వల్ల రోడ్డు డ్యామేజి అయి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది ట్రాక్టర్ కేజ్ వీల్స్ తో రోడ్లపైకి వచ్చే ట్రాక్టర్ యజమానులపై మోటారు వాహన చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కాబట్టి ఇట్టి విషయాన్ని ట్రాక్టర్ యజమానులు గమనించాలని అన్నారు.