అక్రమ మట్టి రవాణాపై బిజెపి నాయకులు తహసిల్దార్ కు వినతి పత్రం
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూలై 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న విషయంపై బిజెపి నేతలు మండల తహసిల్దార్ రజనీకుమారి కి మంగళవారం నాడు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రామాయంపేట పట్టణ బిజెపి అధ్యక్షుడు భానుచందర్ మాట్లాడుతూ పట్టణంలో మల్లెచెరువులో పర్మిషన్ లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. వాల్టా చట్టం 2002 క్రింద అక్రమ మట్టి రవాణా చేసిన వారిపై అధికారులు కేసులు నమోదు చేయాలని వారికి వినతి పత్రం సమర్పించిన్నట్లు తెలియపరచారు.