BJYM ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని MRO కార్యాలయం ముందు నిరసన

సిల్వర్ రాజేష్ స్టూడియో 10టీవీ ప్రతినిధి (మెదక్).

Thedi-2-6-2024.

ఈరోజు BJYM ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని MRO కార్యాలయం ముందు నిరసన తెలపడం జరిగింది

BJYM మెదక్ జిల్లా అధ్యక్షులు సతీష్ పటేల్ గారు మాట్లాడుతూ నీళ్ళు – నిధులు – నియామకాలు అంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు నియామకాల విషయంలో నిరుద్యోగులు మోసానికి గురవుతున్నారనేది జగమెరిగిన సత్యం. గత BRS ప్రభుత్వం నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపించినట్లుగానే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే పంథాలో నడుస్తూ హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తుంది. ఈ మోసాలను ఎండగడుతూ తెలంగాణ యువత తరపున, నిరుద్యోగుల తరపున BJYM గత కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉంది. అయినప్పటికీ ఈ నియంతృత్వ ప్రభుత్వం కనీస స్పందన లేకుండ గడిపేస్తుంది. నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుంది.

BJYM రాష్ట్ర శాఖ నిరుద్యోగుల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ప్రధాన అంశాలు..

  1. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో 1:100 ప్రకారం క్వాలిఫై చేయాలి.
  2. గ్రూప్ – 2, గ్రూప్ – 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులను పెంచాలి.
  3. 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహించాలి. ప్రస్తుత డీఎస్సీ పరీక్ష తేదీలను Postpone చేసి నూతన తేదీలను ప్రకటించాలి.
  4. అన్ని నియామకాల్లో మహిళా అభ్యర్థులకు 33% రిజర్వేషన్ కేటాయించాలి.
  5. పోలీసు కానిస్టేబుల్ నియామకాల్లో అభ్యర్థులకు అన్యాయం చేస్తున్న G.O. No. 46ను వెంటనే రద్దు చేయాలి.
  6. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని
    మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఎమ్మార్వో గారికి వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం లో బీజేవైఎం అసెంబ్లీ కన్వినర్ సాయిబాబా గారు, జిల్లా ఉపాధ్యక్షులు రాహుల్,మెదక్ మండల్ అధ్యక్షులు మార్గం రాజు, బబ్లు,పోగుల రాజు,అశోక్,బాబు పాల్గొన్నారు.
Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!