Reporter -Silver Rajesh Medak.
జూన్ 27-2024
ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ
గురువారం చిలిపిచేడు మండలంలో అగ్రో రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ రిజిస్టర్ను మరియు గోదాంలోని ఎరువుల నిలువలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నావని ఎలాంటి కొరత లేదని తెలిపారు.జిల్లావ్యాప్తంగా యూరియా 10168 మెట్రిక్ టన్నులు, డి ఏ పి 704 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 4417 మెట్రిక్ టన్నులు, పొటాష్ 373 మెట్రిక్ టన్నులు, సూపర్ ఫాస్పేట్ 285 మెట్రిక్ టన్నులు అన్నీ కలిపి 15947 మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు.
ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు అగ్రో రైతుసేవా కేంద్రాలు డిసిఎంఎస్ కేంద్రాలు మరియు ప్రైవేటు దుకాణాల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అందరు డీలర్లు తప్పనిసరిగా లైసెన్సును కలిగి ఉండాలని ఎరువుల నియంత్రణ చట్టం 1985 నియమ నిబంధనలు పాటిస్తూ, పి ఓ ఎస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలని వివరించారు.
ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ కార్డు వివరాలను సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.