రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 24:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి నూతనంగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర గురుకుల డిగ్రీ కాలేజీకి కళాశాల విద్యార్థినిలకు ఫ్యాన్లు లేక ఇబ్బందికరంగా ఉన్నందున డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శిరీష వైస్ ప్రిన్సిపాల్ సబితలు రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయంలో మున్సిపల్ చైర్మన్ చొరవ తీసుకొని వెంటనే స్పందించి తన స్వతగా 25 వేల రూపాయల విలువ గల సీలింగ్ ఫ్యాన్లు ఆన్లైన్ లో తెప్పించి పది ఫ్యాన్లు కళాశాల ప్రిన్సిపాల్ కు తన మున్సిపల్ సిబ్బంది ద్వారా అందజేయడం జరిగింది.అదే మాదిరిగా విద్యార్థులకు సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో మున్సిపల్ బోర్ నుండి వాటర్ సౌకర్యం కూడ ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కళాశాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ చైర్మన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.