–ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నాయకులు మహేష్..
స్టూడియో 10 టీవీ న్యూస్, జూన్ 19,సిరివెళ్ళ
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ని తమ నివాసంలో మహాదేవపురం గ్రామ టిడిపి నాయకులు వి. మహేష్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శివగామిని గా పేరుగాంచిన మంచికి మారుపేరు, మీ కష్టంలో నేనుంటాను అంటూ పిలిస్తే పలికే మంచి మనసున్న భూమా అఖిల ప్రియ ని,ఆళ్లగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసన సభ్యురాలుగా, ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రావణాసురుడి పాలన పోయి, రాముడి పాలన కావాలని, ప్రజలు జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదింపడం జరిగిందని, అదేవిధంగా” ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజలు కూడా రైతుల నోటి దగ్గర కూడు తీసి లూటీ చేసే నాయకులు వద్దంటూ” రైతుల కష్టం తెలుసి రైతులకు వెన్నెముకగా నిలిచి ప్రజా సమస్యలపై, ఎప్పటికప్పుడు గళం విప్పే భూమా అఖిలప్రియ కి ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలపొందాలని, కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు ముఖ్యంగా ఆళ్లగడ్డ ప్రజానీకానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.అదేవిధంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. టిడిపి అభివృద్ధికి మరింత కృషి చేయాలని, మహేష్ కి తెలుపుతూ గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ఆమె తెలిపారు. అనంతరం మహాదేవపురం గ్రామంలో టిడిపి పార్టీని మెజారిటీ స్థానంలో నిలిపినందుకు వి. మహేష్ ని అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు పాల్గొన్నారు.