అనాధలకు నిరుపేదలకు అన్న వితరణ చేస్తూ అండగా నిలిచిన నాగభూషణం చారి
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని గోల్పర్తి ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న శ్రీ భవాని శంకర అన్నప్రసాద వితరణ సేవా క్షేత్రం నిర్వాహకులు నాగభూషణం చారి ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీ, కోటమబస్తీ,దుర్గమ్మ బస్తి, అక్కలబస్తీ,ఎడుల ఎల్లమ్మ బస్తి ప్రాంతాలలో సుమారుగా 100 మంది నిరుపేదలకు, అనాథలకు, అశక్తులకు, అనారోగ్యంతో అలమటిస్తున్న వారికి అన్న ప్రసాద వితరణ ప్యాకెట్ల ద్వారా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నాగభూషణం చారి తెలిపారు. అదేవిధంగా తాము గత సంవత్సరం నుండి మన రామాయంపేట ప్రాంతంలో శ్రీ భవాణి శంకర అన్న ప్రసాదo వితరణ సేవ క్షేత్రం తరపున నిరుపేదల కోసం బాటసారుల కోసం వేసవికాలంలో అంబలి, నిరుపేద వధువుల కోసం పుస్తె మట్టెలు, తల్లిదండ్రులు లేని నిరుపేద వధువులకు ఉచిత వివాహాలు దేవతా పూజ మొక్కల వితరణ సేవ, గోవుల సేవ కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు రామాయంపేట పట్టణంలోని సామాజిక కార్యకర్తలు,సంఘ పుర ప్రముఖులు, పెద్దలు అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందించాలని దైవ ఆశీర్వదములు పొందాలని సవినయంగా ఆయన కోరారు.