రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 19:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో బుధవారం రోజు మెదక్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ఇందిరా గాంధీ ఎంతగానో ప్రజలకు సేవలు అందించిందని గుర్తు చేశారు.అదే బాటలో సోనియా గాంధీ దేశ సమగ్ర రక్షణ కోసం ప్రజల సేవయే లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపిస్తున్న నాయకురాలు అన్నారు.తల్లి బాటలోనే కుమారుడైన రాహుల్ గాంధీ దేశ ప్రజల రక్షణ కోసము దేశ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు నడిపిస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు.అదే బాటలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు నడుచుకొని దేశ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరు పాటుపడాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు డాకి స్వామి, విప్లవ్ కుమార్ జీడిపల్లి సత్యం, బైరం కుమార్, దోమకొండ వెంకట్,గొల్పర్తి సత్యం,సురేష్ నాయక్, బొట్ల బాబు,సామల రాజు,పోచమ్మల గణేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు దాకి నాగేందర్, పోచమ్మల మహేష్, సంపత్, నరేందర్, సాయికుమార్, తదితరులు పాల్గొన్నారు.