Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
తేది -18.06.2024.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే మరియు విధ్వంస పూరితమైన ప్రసంగాలు పోస్టులు పెట్టవద్దు మెదక్ ఎస్పీ . డా.బి .బాలస్వామి ఐ.పీ.ఎస్.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ…మెదక్ పట్టణంలో ఇరు వర్గాల్లో జరిగిన గొడవలు అదుపులోకి వచ్చాయని గొడవలకు కారణమైన ఒక వర్గానికి చెందిన 16 మందిని మరో వర్గానికి చెందిన 11 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించామని అన్నారు. రెండు వర్గాల మధ్య జరిగిన గొడవల కారణాంగా ఇతర జిల్లాల నుంచి పోలీస్ ఫోర్స్ తెప్పించి అంతా అదుపులోకి తెచ్చినట్టు తెలిపారు. సోషల్ మీడియా వేదిక అనగా వాట్సాప్, ట్విట్టర్,ఫేస్ బుక్ మొదలైన వాటి ద్వారా వచ్చే ఎలాంటి వదంతులను ప్రజలు నమ్మవద్దని సూచించారు. ఎవరైనా ఉద్దేశ్యపూరకంగా సోషల్ మీడియాలో కానీ మరే ఇతర రకంగా గొడవలు పెట్టాలనుకుంటే వారిపై చట్ట పరమైన చర్యలు ఉంటాయని సోషల్ మీడియా పై నిఘా నడుస్తున్నదని గొడవలకు కారణమైన ఎవరిని వదలమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో విద్వేషకర, రెచ్చగొట్టే, తప్పుడు పోస్టులు పెట్టవద్దని అలా కాదని ఎవరైనా తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని జిల్లా పోలీసులు నిరంతరం గమనిస్తారని అలాంటి వారిపై చట్ట ప్రకారం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో అనవసర పోస్టులు, కామెంట్స్, సోషల్ మీడియాలో పెట్టవద్దని, తప్పుడు, రెచ్చగొట్టే ఆరోపణలు అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాద్యమాలు అయిన వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం, టెలిగ్రామ్, యూట్యూబ్ లాంటి సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని తప్పుడు, విద్వేషకర పోస్టులు చేసిన,షేర్ చేసినా తగిన చర్యలు తప్పవని గొడవలకు సంబంధించిన అన్ని వీడియోలు ఉన్నాయని, వాటి ఆధారంగా నిందితులను గుర్తించామని చెప్పారు. ఇట్టి గొడవలపై సమగ్ర విచారణ జరుగుతున్నదని గొడవలకు కారణమైన ఎవరిని విడిచిపెట్టేది లేదని ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని ఏమైనా అనుమానాలు ఉంటే సంబందిత అధికారులను సంప్రదించాలని అన్నారు.