అక్కన్నపేట శివారులో కారు అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొని దగ్ధం
రామాయంపేట (స్టూడియో10 టీవీ ప్రతినిధి) జూన్ 17:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మానేగల రామకిష్టయ్య చెల్లెలు కుటుంబ సభ్యులతో కలిసి కాట్రియాల నుండి పాపన్నపేట మండలం ఏడుపాయల వన దుర్గ భవాని వద్దకు ఆదివారం రోజు దర్శనానికి వెళ్లి అక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భోజనం చేసి తిరుగు ప్రయాణమై కాట్రియాల తన చెల్లెలు ఇంటికి చేరుకొని అక్కడ వారిని దింపి అక్కడనుండి రామాయంపేట కు కారులో తన కూతుర్ని దింపడానికి డ్రైవర్ కారు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను ఇంటి వద్ద వదిలిపెట్టి తిరిగి ఝాన్సీ లింగాపూర్ కు వస్తుండగా అక్కన్నపేట గ్రామ శివారులోని పకిర్ సాల గుట్ట వద్దకు రాగానే నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు ఎత్తుగా ఉండడం వల్ల TS 35 E 98 99 నెంబర్ గల స్కార్పియో కారు ఒక్కసారిగా అదుపుతప్పి కుడివైపున ఉన్న కల్వటుకు ఢీకొట్టి క్రిందికి పడిపోయింది. డ్రైవర్ శివ ప్రమాదం జరుగుతున్న సమయంలో అక్కన్నపేట గ్రామస్తులకు సమాచారం అందించాడు.వెంటనే అతని కారులోంచి బయటకు తీశారు. మెల్లగా డీజిల్ ట్యాంక్ కూలెంట్ పగిలి ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే రామాయంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో మానెగల రామకిష్టయ్య లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చును.