నవీపేట్ రిపోర్టార్ సురేందర్
స్టూడియో 10టీవీ ప్రతినిధి, తేది :16-6-2024
తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్. పట్టణంలోని PRTU భవన్లో ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్ యజమాన్యం బుక్స్ షూస్ యూనిఫామ్ అమ్మకూడదని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి పరిషత్ బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలే నాగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ అలాగే విద్యార్థులకు అధిక ధరలకు షూస్ బుక్స్ యూనిఫామ్ అమ్మడం వంటివి చేస్తున్న పాఠశాలను సీజ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థలో లాభాపేక్ష ఉండకుండా పని చెయ్యాలని విద్యారంగం సేవారంగం అని గుర్తుపెట్టుకొని ప్రైవేట్ పాఠశాలలు వ్యవహారం చెయ్యాలని లేనియెడల పాఠశాలలో నోట్ బుక్స్ పట్టుబడితే మేమే వాటిని బిద విద్యార్థులకు పంచిపెట్టే కార్యక్రమం చేస్తాం అని హెచ్చరించారు.కావున ఎంఈఓ గారు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో శివ, మజీద్, విగ్నేష్, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.